జనం న్యూస్ నవంబర్ 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
సంగారెడ్డి పాత బస్టాండ్ సమీపంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠ శాలను కలెక్టర్ ప్రావీణ్య శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బడి ఆవరణలో చెత్త పేరుకుపోవడం, మరుగు దొడ్లు, మూత్రశాలల నిర్వహణ సరిగా లేక దుర్వాసన వస్తుండటంతో ప్రధానోపాధ్యాయురాలు రోజాపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.డస్ట్ బిన్లు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు ప్రధానోపాధ్యాయురాలిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలలో పారిశుద్ధ్య సిబ్బందిని తొలగించాలని సూచించారు. వెంటనే డస్ట్ బిన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు….


