జనం న్యూస్ నవంబర్ 10 కోదాడ
కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో టి సాట్, తెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులకు క్విజ్, వ్యక్తత్వ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్ ప్రారంభించారు. పోటీ పరీక్షల ద్వారా విద్యార్థుల ప్రతిభ మెరుగుపడుతుందని ఆయన తెలిపారు. మండల స్థాయిలో ఉత్తమ విద్యార్థులను ఎంపిక చేయడానికి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.


