Listen to this article

జనం న్యూస్ సూళ్లూరుపేట తిరుపతి జిల్లా

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట స్టార్ బస్టాండ్ వద్ద గల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి శ్రీ హరిహర సుతుడు, ఆపద్బాంధవుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, శ్రీ అయ్యన్ అయ్యప్ప స్వామి 27వ వార్షికోత్సవ జ్యోతుల గ్రామోత్సవం డిసెంబర్ 7వ తారీకు సూళ్లూరుపేటలో అంగరంగ వైభవంగా నిర్వహించునున్నారు. అయ్యప్ప స్వామి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా పార్లమెంటు సభ్యులు మద్దెల గురుమూర్తి, సూళ్లూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ, సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానం మాజీ చైర్మన్ వేనాటి రామచంద్రారెడ్డి, నెల్లూరు జిల్లా మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, సూళ్లూరుపేట మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి, సూళ్లూరుపేట మండల మాజీ అధ్యక్షులు అల్లూరు అనిల్ రెడ్డి, సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య, కాంట్రాక్టర్ సురేష్ రెడ్డి సహకారంతో స్వస్తిశ్రీ శ్రీవిశ్వావసు నామ సంవత్సర బహుళ తదియ 07.12.2025 తేదీ ఆదివారం ఉదయం 6గం గణపతి పూజ, 7.30 నిమిషముల నుండి 9 గంటల వరకు గణపతి హోమం, 9.15 నిమిషముల నుండి 12 గంటలు వరకు అయ్యప్ప స్వామికి 16 ద్రవ్యములు తో నెయ్యి అభిషేకం, తదుపరి సాయంత్రం 6గం ల నుండి దీపారాధన తో అయ్యప్ప స్వామి గ్రామోత్సవం జరుగును కావున సూళ్లూరుపేట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు ,భక్తులు పాల్గొని పై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అయ్యప్ప ఉత్సవ కమిటీ సభ్యులు కోరారు.