Listen to this article

జనం న్యూస్ 11 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

జోగులాంబ గద్వాల్ జిల్లా వివిధ ప్రాంతాల్లోఎకరాకు 7 క్వింటాళ్ల పరిమితి నిబంధనను సడలింపు చేయాలి.స్లాట్ బుకింగ్ సమయాన్ని నిరంతరం కొనసాగిస్తూ డెలివరీ తేదీలను కేటాయించాలి మరో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన.. యన్ యచ్చ్ పి యస్ జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్.జోగులాంబ గద్వాల్ జిల్లా నియోజకవర్గం లోని సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రంలో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ అన్నారు. మంగళవారం సాయి బాలాజీ సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని సమితి నాయకులతో కలిసి ఆయన సందర్శించి రైతుల ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన. మాట్లాడుతూ… సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రంలో రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతుల ఇబ్బందులను అరికట్టి వెంటనే రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిత్యం స్లాట్ బుకింగ్ కోసం రైతులు పడిగాపులు ఇబ్బందులు పడుతున్నారని,స్లాట్ బుకింగ్ ను నిరంతరం ఏర్పాటు చేసి డెలివరీ తేదీలను ఖరారు చేసేందకు చర్యలు తీసుకోవాలని కోరారు.ఎకరాకు 7క్వింటాళ్ల నిబంధనను సడలించాలని, రైతులకు అవగాహన కల్పించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు.రెండవ సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ఏర్పాటు చేసి , సీసీఐ కొనుగోలు కేంద్రాలలో రైతులకు కనీస మౌలిక వసతులు కల్పించాలన్నారు.నిత్యం రైతులకు కెపాసిటీ ప్రకారం తీసుకోని, దీన్ని రోజుల మాదిరిగా తేదీలను ఖరారు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల మేలుకోసం నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రైతుల సమస్యల పరిష్కారానికై జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు, జిల్లా నాయకులు వెంకట్రాములు, మండల నాయకులు అడవి ఆంజనేయులు, భూపతి నాయుడు, బలిజ రాజు, సురేష్,బీసన్న తదితరులు పాల్గొన్నారు.