Listen to this article

జనం న్యూస్ నవంబర్ 11 చిలిపి చెడు మండల ప్రతినిధి

మెదక్ జిల్లా చిలిపి చెడ్ మండల సమైక్య కార్యాలయంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మండల సమైక్య లోని సభ్య గ్రామ సంఘాల అధ్యక్ష,కార్యదర్శి, కోశాధికారులకు ఓరుగల్లు మహా సమైక్య నుండి వచ్చిన సీనియర్ సిఆర్పిలు ఎండి.షాహీన్, యు.సరిత గార్లచే శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది
చిలిపిచేడు మండలంలో ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ సంఘాల లీడర్లకి వారి యొక్క విధులు, బాధ్యతలు మరియు అధికారాల పై శిక్షణ ఇవ్వడం జరిగింది.పుస్తక నిర్వహణపై గ్రామ సంఘాల మరియు మండల సమైక్యల సమగ్ర నిర్వహణపై పరిపూర్ణ అవగాహన ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో ఏపిఎం మార్గం గౌరీ శంకర్ సిసిలు శ్రీకాంత్ లక్ష్మణ్ పురుషోత్తం అకౌంటెంట్ మానస మండల సమైక్య అధ్యక్షురాలు మమత కార్యదర్శి మాధురి కోశాధికారి అంజలి లతోపాటు సభ్య గ్రామ సంఘాల పదాధికారులు పాల్గొన్నారు