జనం న్యూస్ నవంబర్ 11 ( ముమ్మిడివరం ప్రతినిధి): గ్రంధి నానాజీ
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి.రాగంపేటకు చెందిన శ్రీమతి కరెడ్ల దేవి గారిని సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ మహిళా అధ్యక్షురాలుగా నియమించారు. ఈమె గతంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా సేవలందించారు. ఆనురు కొండపల్లి చెందిన దువ్వ వెంకటపతి, గంగా భవాని పుణ్యం దంపతుల కుమార్తె అయినా కరెడ్ల దేవి గారిని సౌత్ ఇండియా కాపునాడు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆంధ్ర ప్రదేశ్ శాఖ అధ్యక్షులు శ్రీ వేల్పూర్ శ్రీనివాస్ ఈ సందర్భం నియామక పత్రాన్ని పంపించారు. రాష్ట్ర బిజెపి శాఖలో కీలక నాయకురాలుగా ఉన్న, డాక్టర్ కరెడ్ల శ్రీనివాస్ సతీమణి అయిన శ్రీమతి కరెడ్ల దేవి(738 66666 18) (సైకాలజిస్ట్)గారిని సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ అధ్యక్షురాలుగా నియమించిన సందర్భంగా కాపు సంఘాల జేఏసీ కోఆర్డినేటర్ కాపు రత్న కె.వి.ఆర్ నాయుడు, జనసేన నాయకురాలు డాక్టర్ వరలక్ష్మి తదితరులు శుభాకాంక్షలు తెలియపరిచారు.


