తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 12
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీసీ జేఏసీ జహీరాబాద్ తాలూకా నాయకులు కొండపురం నర్సిములు, డాక్టర్. పెద్దగొల్ల నారాయణ, విశ్వనాథ్ యాదవ్, శంకర్ సగర ,వడ్డే శేఖర్ లు హాజరై వారు మాట్లాడుతూ బీసీలు రాజకీయంగా చైతన్యం కావలసినటువంటి అవసరం ఉందని, రాష్ట్ర జనాభాలో సగానికి పైగా బీసీలు ఉన్నప్పటికీ ఏ రాజకీయ పార్టీ కూడా రాజ్యాధికారంలో సమానమైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు . అదేవిధంగా బీసీ జేఏసీ మొగుడంపల్లి మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.మొగుడంపల్లి మండల బీసీ జె ఏ సి అధ్యక్షుడు గా మన్నపూర్ గ్రామ వాసి అయిన గొల్ల దశరత్ ను,మండల ఉపాధ్యక్షులు గా మచెందర్, చందు గౌడ్,ప్రధాన కార్యదర్శి లుగా అవిటి చిరంచిజి, బుడగ శ్రీను,కార్యదర్శిలుగా అలురు కిష్టయ్య, బర్ల పాండు, వడ్డే చందు, రాజ్ కుమార్ లను,సోషల్ మీడియా ఇంఛార్జి గా జగన్ మన్నపూర్,మీడియా ఇంఛార్జి గా మారుతి, ముఖ్య సలహాదారు లు గా గాలప్ప,రాజు లను కమిటీ నియమించారు.


