జహీరాబాద్, నవంబర్ 13 సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి బి వీరేశం జనం న్యూస్
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం అంత్వార్ గ్రామంలో ఈనెల 14 నుండి 18 వరకు శ్రీ జీవన్ముక్త మహారాజ్ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆ సంస్థానాధీషులు జ్ఞానేశ్వర్ మహారాజ్ ( బాలరాజు) ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా ఈ నెల 14 న శిఖర స్థాపన, 15 న గరుడ వాహన సేవ, 16 న మహాపూజ, 17 న గోపాళ కాల, 18 న రథోత్సవం కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. ఐదు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలకు గాను రాష్ట్రవ్యాప్తంగా భక్తులు పాల్గొంటారని, అత్యంత వైభవంగా జరిగే శ్రీ జీవన్ముక్త మహారాజ్ ఉత్సవాలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. జహీరాబాద్, సంగారెడ్డి, సదాశివపేట పట్టణాల నుండి ఆర్టీసీ బస్ సౌకర్యం ఉందని ఆయన వెల్లడించారు.


