జనం న్యూస్, నవంబర్
13,అచ్యుతాపురం:చోడవరం మండలం వెంకన్నపాలెంలో నూతనంగా హెరిటేజ్ డైరీ చిల్లింగ్ సెంటర్ ను జోనల్ మేనేజర్ వి దివాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా రీజనల్ మేనేజర్ పి తులసి నాయుడు మాట్లాడుతూ చోడవరం,అనకాపల్లి, కోటపాడు,దేవరాపల్లి,సబ్బవరం మండలాల నుంచి పాడి రైతుల దగ్గర నుంచి పాలు సేకరించి జిల్లాలో అన్ని డైరీలకంటే ఎక్కువ రేటు పాడి రైతులకు చెల్లిస్తుందని,అంతేకాకుండా ప్రతి సంవత్సరం రెండుసార్లు పాడి రైతులకు బోనస్ మరియు హెరిటేజ్ డైరీకి పాలు సరఫరా చేస్తున్న పాడి రైతు ప్రమాదంలో చనిపోతే రూ.2లక్షలు సహజ మరణానికి రూ.50 వేలు హెరిటేజ్ డైరీ కుటుంబం నామినికి అందజేస్తుందని తెలిపారు.పాడి పశువులకు కృత్రిమ గర్భధారణ రూ.50కు అదే విధంగా ఆడపెయ్య పుట్టుటకు రూ.500 లకే కృత్రిమ గర్భధారణ రైతులకు అందించబడునని అన్నారు.అంతేకాకుండా హెరిటేజ్ డైరీ పాడి రైతులకు అండగా ఉంటుందని తెలిపారు. హెరిటేజ్ డైరీకి పాలు సరఫరా చేస్తున్న ప్రతి గ్రామములో పశువులకు కృత్రిమ గర్భధారణ అందరికీ అందుబాటులో ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో హెరిటేజ్ డైరీ ఐటీ హెడ్ కె సుధాకర్ నాయుడు, ఏరియా మేనేజర్ మనోహర్,హెరిటేజ్ డైరీ మేనేజర్ కూండ్రపు శేషు, మంగారావు, ఆర్ వై నాయుడు, ఎం రామకృష్ణ తదితర మేనేజర్లు పాల్గొన్నారు.


