Listen to this article

జనం న్యూస్ నవంబర్ 13 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

పాడేరు నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ సంస్థగత ఎన్నికల్లో మండల కమిటీ సభ్యులుగా ఎన్నికైన వారి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి మాజీ శాసన మండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పాడేరు ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన బుద్ధ నాగ జగదీశ్వరరావు పాడేరు నియోజకవర్గ ఇన్చార్జ్ గిడ్డి ఈశ్వరి ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ముందుగా తెలుగుదేశం జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం జరిగిన సమావేశంలో నాగ జగదీష్ కీర్తిశేషులు నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలవేసి ఘనమైన నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ దేశంలో తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, కోటి సభ్యత్వం ఉన్న పార్టీ గా, క్రమశిక్షణతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నడుపుతున్న పార్టీలో మనమంతా కుటుంబ సభ్యులుగా ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని, ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పార్టీ సంస్థాగత ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించి పార్టీ నియమాలకు కట్టుబడి ఉంటామని ప్రమాణస్వీకారం చేసి ప్రజా సమస్యల కోసం ప్రజా సేవ కోసం ప్రజల మధ్యనే నిరంతరం ఉంటూ రాష్ట్ర పార్టీ ఆదేశాలతో నడుచుకుంటున్నారని, అదేవిధంగా ఇప్పుడు ఎన్నికైన సభ్యులు అంతా పార్టీ నియమావళికి కట్టుబడి పనిచేయాలని, పార్టీకి కష్టపడి పనిచేసే ప్రతి వ్యక్తికి గుర్తింపు ఉంటుందని, కొంతమందికి పార్టీ పదవులు, మరి కొంతమందికి స్థానిక సంస్థలు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందని, అలాగే ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు వస్తాయని, కనుక మండల కమిటీలు ప్రతి రెండు నెలలకు ఒకసారి సర్వసభ్య సమావేశాలు నిర్వహించి, కార్యకర్తలు అభిప్రాయాలు, ప్రజా సమస్యలు చర్చించి రాష్ట్ర పార్టీకి తీర్మానాల పంపించవలసి ఉంటుందని, అలాగే కస్టర్, యూనిట్, బూత్ కమిటీ సభ్యులు బాధ్యతగా పనిచేయవలసి ఉంటుందని, రానున్న స్థానిక సంస్థలు ఎన్నికల్లో అన్ని మండలాల్లో తెలుగుదేశం విజయకేతం ఎగరేవేయాలని పార్టీ నాయకులకు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం మండల కమిటీ సభ్యులు చేత ప్రమాణస్వీకారం చేయించారు. ముందుగా నియోజకవర్గ ఇన్చార్జ్. గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ పార్టీ ఆదేశాల ప్రకారం ప్రజాస్వామ్య పద్ధతిలో కొన్ని మండలాల్లో ఏకాభిప్రాయం లేనప్పటికీ, ఒకటికి రెండుసార్లు సమావేశాలు నిర్వహించి అందర్నీ ఏకతాటిపై తీసుకువచ్చి పాడేరు నియోజకవర్గం లో రాబోయే ఏ ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ విజయo సాధిస్తుందని, రాష్ట్ర పార్టీ ఆదేశాల ప్రకారం అందరమూ సమన్వయంతో ముందుకు వెళ్దామని గిడ్డి ఈశ్వరి అన్నారు. ఈ కార్యక్రమంలో భారీ స్థాయిలో పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా సభ్యులు పాల్గొన్నారు.