జనం న్యూస్,నవంబర్ 14,అచ్యుతాపురం:
58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు అచ్యుతాపురం శాఖా గ్రంథాలయం నందు నవంబర్ 14 నుండి 20 వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులకు వారం రోజులపాటు వివిధ పోటీలు నిర్వహించబడతాయని,ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అతిధుల చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరుగుతుందని,ఈ కార్యక్రమం విద్యార్థులలో గ్రంథాలయాల ప్రాముఖ్యతను పెంచే లక్ష్యంతో నిర్వహించబడుతోందని లైబ్రరీయన్ ఎల్ వి రమణ తెలిపారు.


