Listen to this article

జనం న్యూస్ నవంబర్ 13 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

ఐ పోలవరం మండలం తిల్లకుప్ప గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సిద్ధి వినాయక స్వామి 16వ వార్షికోత్సవం కాళ్లకూరి కామేశ్వర శర్మ పండిత ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెల్లవారుజామున స్వామివారిని నదీ స్నానానికి తీసుకెళ్లి ఊరేగింపుగా తీసుకొని రావడం మరల ఉత్సవమూర్తులతో ఎస్ ఎస్ ఎఫ్ ధర్మ ప్రచారక్ కనకారావు చే నగర సంకీర్తన నిర్వహించి ముందుగా మండపారాధన 16 కలశములతో స్థాపన చేసి గోపూజ మూల విరాటకు అభిషేకములు శాంతి హోమం ప్రసాద వితరణ గావించినారు ఈ సందర్భంగా సమరసత సేవా ఫౌండేషన్ మండల కన్వీనర్ గాదిరాజు విశ్వనాథరాజు కార్తీక మాసంలో ఇంత మహత్తర కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఎంతో పుణ్యప్రదం స్వామి అనుగ్రహం ఉంటుందన్నారు అలాగే ప్రతి ఒక్కరూ హిందూ ధర్మ పరిరక్షణలో పాలుపంచుకొని మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు గ్రామస్తులు మాతృమూర్తులు తోపాటు తోటకూర బాబులు రాజు శీలం నాగేశ్వరరావు యనమగల త్రినాధ కుమార్ మెర్ల కొండలరావు శీలం నాగరాజు కొండేటి వెంకట్రావు కొప్పిశెట్టి వీరంశెట్టి రాయుడు శ్రీనివాస్ శీలం సునీత పల్ల సురేష్ శీలం ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు.