జనం న్యూస్; నవంబర్ 13 గురువారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్
శ్రీ వాణి స్కూల్ భారత్ నగర్ సిద్దిపేటలో ముందస్తుగా బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా గురువారం రోజున జరిగాయి. విద్యార్థినీ విద్యార్థులు నెహ్రూ , భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు ,ఝాన్సీ లక్ష్మీబాయి వేషధారణలో ఆకట్టుకున్నారు. సుమారు 240 విద్యార్థిని ,విద్యార్థుల చేత నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ సి .హెచ్. సత్యం మాట్లాడుతూ గత 14 సంవత్సరాల నుంచి మా పాఠశాలను బాలాల దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నామని, దేశానికి మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఆయన జన్మదిన వేడుకలు బాలల దినోత్సవంగా జరుపుకుంటామని. ప్రతి సంవత్సరం మా పాఠశాలలో బాలలదినోత్సవo సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, మన చిన్నప్పుడు చేసిన అల్లర్లు, జ్ఞాపకాలను మరవలేమని గుర్తు చేశారు. చదువుతోపాటు , కళలు, ఆటలు మా పాఠశాలలో ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తామని, విద్యార్థులు అన్ని రంగాలలో రాణించాలని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


