Listen to this article

కోదాడ జనం న్యూస్ నవంబర్ 13

డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం అని బిఎస్ఎఫ్ఐ నాయకులు ప్రేమానంద్ పిలుపు ఇచ్చారు. గురువారం కోదాడ పట్టణంలోని పలు పాఠశాలల్లో యాంటీ డ్రగ్స్ అవర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. మాదకద్రవ్యాల ప్రభావం నుంచి సమాజాన్ని దూరంగా ఉంచడం కోసం ప్రతి యువకుడు బాధ్యత తీసుకోవాలన్నారు. సమాజంలో మద్యపానం, ధూమపానం,గంజాయికి నో చెప్పి ఆరోగ్య, చైతన్యవంతమైన భారత నిర్మాణానికి తోడ్పడాలని వారు ఆకాంక్షించారు. పలు పాఠశాలల్లో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.