జనం న్యూస్ 14 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
సమాజ అభివృద్ధిలో పాత్రికేయుల పాత్ర అత్యంత కీలకమని ప్లానింగ్ సెక్రెటరీస్ టెక్నికల్ అసోసియేషన్ (పీ.ఎస్.టీ.ఏ) జిల్లా అధ్యక్షుడు పొట్నూరు శ్రీకాంత్ అన్నారు. వార్తల సేకరణలో ఇబ్బందులు ఎదుర్కొంటూ సమస్యలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టుల సేవలను ఆయన కొనియాడారు. ఏపీయూడబ్ల్యూజే డిప్యూటీ జనరల్ సెక్రటరీ శివ ప్రసాద్, విజయనగరం జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు లింగాల నరసింగరావులను సత్కరించారు.


