జనం న్యూస్ 14 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం నియోజకవర్గానికి సంబంధించి నూతనంగా నియమించిన పట్టణ/వార్డు కమిటీలు, క్లష్టర్,యూనిట్, బూత్ ఇన్ ఛార్జుల ప్రమాణస్వీకారం గురువారం నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున, ఎమ్.ఎల్.ఏ. అదితి పాల్గొన్నారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకి పార్టీ గుర్తిస్తుందని, అన్ని కమిటీలతో ప్రమాణస్వీకారం చేయించారు. పార్టీని అభివృద్ధి చేయాలని.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం దిశగా పనిచేయాలని కోరారు.


