జనం న్యూస్ నవంబర్ 14 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంనడవపల్లి గ్రామంలో ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం నందు అయ్యప్ప స్వాములకు 41రోజులు మండల కాలం దీక్ష పూర్తి చేసి ఈరోజు అయ్యప్ప స్వాములకు ఇరుముడి కార్యక్రమం నిర్వహించారు ..ఈ కార్యక్రమంలో 80మంది స్వాములకు ఇరుముడి కట్టారు… నడవపల్లి శ్రీ ధర్మశాస్త్ర పీఠం గురుస్వామి కే.టి వెంకటేశ్వర్లు, సంసాని శ్రీనివాసరావు , సూర్యపవన్ గురు స్వాములు ఆధ్వర్యంలో నిర్వహించారు. స్వాములకు ఈ నలభై ఒక్క రోజులు వాడి మరియు అన్నదానం చేసిన దాతలు కడలి ఫణి కుమార్ కముజు లక్ష్మీరమణారావు (దత్తుడు) ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు జయప్రదం చేశారు.




