Listen to this article

జనం న్యూస్ 14 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

సీపీఐ జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వందేళ్ల సందర్భంగా గద్వాల నుంచి నిర్వహించే రాష్ట్ర బస్సు జాతాను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కమిటీ విజ్ఞప్తి చేసింది.సిపిఐ పార్టీ జిల్లా కార్యాలయంలో ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి బి.ఆంజనేయులు మాట్లాడారు. ఈ సందర్భంగా గద్వాలలో ఈనెల 15న నిర్వహించే సిపిఐ రాష్ట్ర బస్సుజాతను జయప్రదం చేయాలని, జాత ప్రారంభోత్సవానికి సిపిఐ జాతీయ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ పల్లా వెంకట్ రెడ్డి , సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహులు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై జాతను ప్రారంభిస్తారని జిల్లా కార్యదర్శి బి.ఆంజనేయులు తెలిపారు. ఈ దేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏర్పడి వందేళ్లు అవుతున్న సందర్భంగా పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తూ ఈ దేశం కోసం ఈ దేశంలో ఉండే సామాన్య పేద ప్రజల కార్మికుల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన సంఘటనలను త్యాగాలను విజయాలను నెమరు వేసుకుంటూ భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలు నిర్మించేందుకు అలాగే విచ్చిన్నకర శక్తులకు బుద్ది చెప్పి దేశాన్ని సమైక్యంగా నిర్మించేందుకు పార్టీని బలోపేతం చేసేందుకు ఈ యొక్క బస్సు జాత కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అలాగే వందేళ్ళ సిపిఐ ఉత్సవాలలో భాగంగా డిసెంబర్ 26వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో ఐదు లక్షల మంది తో భారీ బహిరంగ సభను నిర్వహించడం జరుగుతుందని ఈ యొక్క సభకు ప్రపంచ దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కమ్యూనిస్టు మేధావులు హాజరవుతారని పేర్కొన్నారు కావున వందేళ్ల ఎర్రజెండా పోరాట చరిత్రను చాటి చెప్పేందుకు సిపిఐ రాష్ట్ర బస్సు జాతలను నిర్వహించ తలపెట్టిన సందర్భంగా ఈ నెల 15వ తేదీన జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమానికి కార్మికులు రైతులు ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునివ్వడం జరిగింది. దీని విజయవంతానికి సిపిఐ పార్టీ కార్యకర్తలు ప్రజాసంఘాల నాయకులు సీరియస్గా కృషి చేయాలని కోరారు నేడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిన సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని సగర్వంగా సమైక్యంగా నిలిపేందుకు ఎర్రజెండా నాయకత్వంలో సిపిఐ ఆధ్వర్యంలో మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు ఈ యొక్క మీడియా సమావేశంలో సిపిఐ జిల్లా కార్య వర్గ సభ్యులు కామ్రేడ్ రంగన్న కామ్రేడ్ ఆశన్న జిల్లా సమితి సభ్యులు ప్రవీణ్ పరమేష్ తదితరులు పాల్గొన్నారు