

జనం న్యూస్ జనవరి 10 (నిర్మల్ జిల్లా స్టాపర్ ద్యావతిగంగాధర్) నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఆశా వర్కర్లు నిరాశన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎవరు లేనందున వారి యొక్క సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని గేటుకు అతికించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల నాయకురాలు మాట్లాడుతూ ఆశా వర్కర్లపై ప్రభుత్వ మొండి వైఖరిని నశించాలి ఆశ వర్కర్లకు 18, 000 కనీస వేతనం ఇవ్వాలి ఫిబ్రవరి నెలలో జరగబోయే అసెంబ్లీ సమావేశంలో ఆశా వర్కర్ల సమస్యల ను పరిష్కరించాలని లేనిపక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు కార్యక్రమంలో ఖానాపూర్ మండలంలోని ఆశా వర్కర్లు పాల్గొనడం జరిగింది.