Listen to this article

జనం న్యూస్, నవంబర్ 14,అచ్యుతాపురం:

58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల కార్యక్రమాన్ని అచ్యుతాపురం శాఖా గ్రంధాలయంలో రిటైర్డ్ హెడ్మాస్టర్ కే కుసుమ కుమారి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.బాలల దినోత్సవం సందర్భంగా భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పంచాయతీ కార్యదర్శి శైలజారాణి పూలమాల వేశారు. ఈ సందర్భముగా కుసుమ కుమారి మాట్లాడుతూ ప్రతి వ్యక్తి విద్యార్థి దశ నుండే ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని పాఠశాలలో నేర్చుకున్న విద్యతో పాటు గ్రంథాలయంలో జ్ఞానాన్ని స్ఫూర్తిని కలిగించే పుస్తకాలు ఏకాగ్రతతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు. గ్రంథాలయ వారోత్సవాల ప్రాముఖ్యతను గ్రంథాలయ అధికారి ఎల్వి రమణ వివరించారు. ఈ కార్యక్రమంలో తిమ్మరాజుపేట గ్రంథాలయ అధికారి డి కోటేశ్వరరావు,అచ్యుత విద్యాసంస్థల ఏవో వై బంగారు రాజు,పాఠకులు శివకృష్ణ,నరేంద్ర,రాజేష్ మరియు పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.