(జనం న్యూస్ 14 నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి)
భీమారం మండల పరిధిలో ప్రజలు రాకపోకలకు ఇబ్బందిగా మారిన రోడ్డుకు ఇరువైపులా పెరిగిన ముళ్లపదలను భీమారం ఎస్సై కే. శ్వేత స్వయంగా పర్యవేక్షించి శుక్రవారం తొలగింపజేశారు.
ప్రజల భద్రతకే ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా ఎస్సై శ్వేత తెలిపారు. రాత్రి పూట వాహనదారులకు అడ్డంకిగా మారుతున్న ముళ్ళపదల కారణంగా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని గుర్తించి వెంటనే చర్యలు తీసుకున్నట్టు ఆమె పేర్కొన్నారు. స్థానికులు పోలీసు శాఖ స్పందనను వాహనదారులు ప్రశంసించారు


