Listen to this article

జనం న్యూస్ జహీరాబాద్ నవంబర్ 14

జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా చిల్డ్రన్ డే స్థానిక విద్యా భారతి పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల కేరింతల మధ్య సాంస్కృతిక కార్యక్రమాలు, డాన్సులు, మోనో యాక్షన్లను అట్టహాసంగా విద్యార్థులు చేశారని, ఆటలు డాన్సులు పిల్లలకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయని ప్రిన్సిపాల్ టి కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు, స్నాక్స్, బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో స్నేహలత, శ్రీహరి, లక్ష్మీ, శివమాల,సౌజన్య, సంపూర్ణ ఉపాద్యాయులు పాల్గొన్నారు.