Listen to this article

బిచ్కుంద నవంబర్ 14 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం గుండె నెమలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లో నిర్వహించిన బాలల దినోత్సవం వేడుకలలో ముఖ్య అతిథిగా బిచ్కుంద ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. మండల విద్యాధికారి మాట్లాడుతూ మన దేశ ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినము ను పురస్కరించుకొని, నెహ్రూ దేశానికి చేసిన సేవలను విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థులకు ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాలలో వృద్ధి సాధించాలని తెలియజేశారు.. ఈ కార్యక్రమం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుండె నెమిలి అధ్యాపక బృందం మరియు . విద్యార్థులు పాల్గొన్నారు.