జనం న్యూస్ 15 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
జోగులాంబ గద్వాల్ జిల్లా ఆలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు విజయుడు జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గంలోని అయిజ పట్టణంలో సింగిల్ విండో కార్యాలయం నందు మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని నేడు ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు , మార్కెట్ యార్డు చైర్మన్ దొడ్డప్ప సింగిల్ విండో అధ్యక్షుడు పోతుల మధుసూదన్ రెడ్డి సంయుక్తంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎక్లాస్పురం నరసింహారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ మాల నర్సింహులు, బ్రహ్మయ్య, సిద్దిరామప్ప, జంబయ్య, గజ్జి దేవరాజ్,యోబు, చాకలి హుస్సేన్, మురళీ, నెస వెంకటేష్, గడిగే రమణ, లెనిన్ బాబు, అంజి,రియల్ ఎస్టేట్ శివ, వీరేష్, రాజ గోపాల్,రవి, నరేష్, మహేష్, అల్తాఫా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల ప్రయోజనార్థం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు తమ పంటలను మధ్యవర్తుల ద్వారా కాకుండా నేరుగా మార్కెట్ యార్డుల్లో విక్రయించి తగిన ధర పొందాలని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కొనుగోలు వ్యవస్థ రైతులకు రక్షణగా నిలుస్తుందని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగం, అయిజ మండలం


