రుద్రూర్, నవంబర్ 15 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ అమన్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించే ఒక రోజు వాలీబాల్ టోర్నమెంట్ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభించడం జరుగుతుందని అమన్ యూత్ అధ్యక్షులు ఫుర్ఖన్ ఖాద్రి తెలియజేశారు. ఆసక్తిగల క్రీడాకారులు 62811 60406 ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఎలాంటి ఎంట్రీ ఫీజులు ఉండబోవని కేవలం రుద్రూర్ మండలానికి సంబంధించిన జట్లకు మాత్రమే అనుమతి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. గెలుపొందిన విజేతలకు బహుమతులతో పాటు నగదు ప్రోత్సాహకాలు ప్రోత్సాహకాలుకూడా అందజేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. టవర్నమెంట్ కు కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. క్రీడల ద్వారా శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా మానసిక బలం కూడా పెరుగుతుందన్నారు. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి స్నేహపూర్వకమైన దృక్పథంతో టోర్నమెంట్లో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


