జనం న్యూస్ సూళ్లూరుపేట
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేని సూరి గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ టిట్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ బాబు గారి సూచనలు మేరకు సూళ్లూరుపేట నియోజకవర్గంలోని మన్నారుపోలూరు లో చిన్న గిరిజనీకాలలో 100 మందికి దుప్పట్లు పంపిణీ చేయడం చేశారు. మాబాషా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి సేవ స్ఫూర్తితో చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వలన చేని సూరి గారి సహకారంతో ఈరోజు మన్నారుపోలూరు నందు చిన్న గిరిజన కాలనీలో 100 కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందని ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేస్తామని ఈ కార్యక్రమానికి సహకరించిన చేని సూరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు మాభాష ఆవుల రమణ, నక్క హరిబాబు,కోటి యాదవ్, ఆవుల దాస్,వీర మహిళలు పద్మజ సుజాత పాల్గొన్నారు.


