

అక్రమంగా రోడ్డును తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలి.
హత్నూర తహసిల్దార్ కు రైతుల ఫిర్యాదు,
జనం న్యూస్. ఫిబ్రవరి 1. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్)
మండల కేంద్రమైన హత్నూర గ్రామ శివారులోని అల్వాయి చెరువు ఆయకట్టు రైతులకు ఉన్న నక్ష బాటను అక్రమంగా తొలగించి కంచె ఏర్పాటు చేసుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మూసాపేట్ నర్సాపూర్ గ్రామాల వరకు ఉన్న ఈనక్ష బాట కబ్జాకు గురి కాకుండా చూడాలని కబ్జా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ హత్నూర తహసిల్దార్ పర్వీన్ షేక్ కు.వినతి పత్రం అందజేశారు, ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, ప్రతిరోజు తమ పంట పొలాలకు ఇదేబాటలోవెళ్తూ ఉంటామని గతంలో మూసాపేట్ నర్సాపూర్ గ్రామాలకు ప్రజలు కాలినడకన వెళ్లేవారని ఐదు శతాబ్దాల నాటి నుండి ఉన్న ఈనక్షబాటరోడ్డుఉందని తెలిపారు.నక్ష బాటలో ఉన్న 20 ఫీట్ల రోడ్డును పది సంవత్సరాల క్రితం ఉపాధి హామీ పథకం కింద మంజూరైన నిధులతో మరమ్మతులు చేయించి సరి చేశామని తెలిపారు, సుమారు 200 మంది రైతులు తమ పంట పొలాలకు చెరువుకు వెళ్లడానికి ఇదే ప్రధాన నక్ష బాట అని అన్నారు.దీంతో రోడ్డుకు ఆనుకొని ఉన్న శ్రీధర్ నాయుడు అనే వ్యక్తి రైతులకు ఉపయోగపడే నక్ష బాట రోడ్డును తొలగించి కంచె వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని రైతుల వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి
నక్షబాట రోడ్డును ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రైతులకు న్యాయం చేయాలని కోరారు, ఈ కార్యక్రమంలో. వీరస్వామి గౌడ్.ఆకుల కిష్టయ్య.గొల్ల యాదయ్య. గుండ రాములు.మైస గళ్ళ ఆశయ్య. నల్లోల్ల పెంటయ్య. పొట్లచెరువునరేందర్. ఆకుల నరేందర్.పొట్లగళ్ల శంకర్. ఆకుల మానయ్య. ఉష్ణగళ్ళ బాలకృష్ణ. మంగలి వెంకటయ్య.బోర్ పట్ల కిష్టయ్య. రైతులు గ్రామస్తులు యువకులు తదితరులు పాల్గొన్నారు.