(జనం న్యూస్ 17నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి)
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన నాయకులు ఇప్పుడు ఓట్ల కోసం మత్తు పదార్థాల వ్యసనాలకు అండగా నిలుస్తున్నారని ప్రజల తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామాల్లో గంజాయి మద్యం సులభంగా అందుబాటులోకి వస్తుండగా ఎన్నికల సమయంలో ఓట్లునాకేవేయాలని మత్తుపదార్థాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇటీవల పోలీస్ విభాగం ఈ మత్తు పదార్థాలపై చర్యలు తీసుకుంటే ” కేసు పెడితే ఏమవుతుంది? మేమే విడిపిస్తామంటూ కొంతమంది రాజకీయ నేతలు బహిరంగానే పొగరుగా ప్రవర్తిస్తున్నారని సమాచారం, ఈ విధమైన ధోరణులు చట్టాన్ని తుంగల తొక్కి యువతను నాశనం చేసే ఈ మత్తు రాజకీయం ఆపాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు, సమాజం మత్తులో మునుగితే భవిష్యత్తు చీకటమవుతుందని సామాజిక కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు మత్తు వ్యసనాలపై పోలీసులు మరింత కఠినంగా చర్యలు తీసుకోవాలని రాజకీయ ఒత్తిడిలకు లోబడకూడదని, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు


