Listen to this article

జిల్లా రక్తదాతల సేవా సమితి
నిర్వాహకులు బోనగిరి శివకుమార్
ముదాం శ్రీధర్ పటేల్

జనం న్యూస్ ఫిబ్రవరి 2 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా )

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో రక్తహీనతతో చికిత్స పొందుతున్న దోమకొండ మండలం లింగుపల్లి గ్రామానికి చెందిన పద్మ, అనే మహిళకు అత్యవసరంగా ఏబీ పాజిటివ్ రక్తం అవసరం కాగా కామారెడ్డి పరిధిలోని లింగాపూర్ గ్రామానికి చెందిన కాసార్ల దేవరాములు పటేల్, వారికి కావాల్సిన ఏబి పాజిటివ్, రక్తం ఇచ్చి మానవత్వం చాటారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సేవ సమితి ప్రారంభించి దాదాపు 15 సంవత్సరాల నుండి దేవరాములు ఎక్కడ రక్తం అవసరం ఉంది. అన్న హైదరాబాద్, నిజామాబాద్ వివిధ ప్రాంతాలకు ఎంత దూరం అయిన ఏ సమయంలో అయిన కామారెడ్డి నుండి అక్కడికి వెళ్లి రక్తం ఇచ్చే వాడని ఇప్పటికి ఇది 20 వ సారి అని తెలియజేసారు. జిల్లావ్యాప్తంగా విష జ్వరాలతో, డెంగ్యూ వ్యాధితో చాలామంది వివిధ వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నారని వారికి కావలసిన రక్తకణాలను రక్తాన్ని అందజేయడానికి రక్తదాతలు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడడం జరుగుతుందన్నారు.
రక్తదాతకు జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులు బోనగిరి శివకుమార్, ముదాం శ్రీధర్ పటేల్, కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పేషంట్ కుటుంబసభ్యులు బ్లడ్ సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు.