Listen to this article

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 18

,,హాద్నూర్ వాలీబాల్ సీజన్.1 టౌర్నిని ఉద్దేశించి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాక్సుద్ అలీ,,

జహీరాబాద్. గ్రామీణ స్థాయి ఆటగాళ్లలో ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు త్వరలో మరిన్ని టోర్నమెంట్లో నిర్వహిస్తామని రోజు రోజుకు విపరితమైన పని ఒత్తిడి వల్ల యువకులు క్రీడలకు దూరమవుతున్నారని జయరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాక్సుద్ అలీ అన్నారు. శనివారం రాత్రి సంగారెడ్డి జిల్లా శాసనసభ పరిది న్యాల్కల్ మండలంలోని హాద్నూర్ గ్రామంలో రెండు రోజులుగా జరుగుతున్న హాద్నూర్ గ్రామ వాలీబాల్ లీగ్.1 పోటీలు అట్టహాసంగా ముగిశాయి. టౌర్ని ముగింపులో ముఖ్య అతిధులుగా గ్రామ పెద్దలు శ్రీధర్ మహరాజ్, సీనియర్ నాయకులు మాక్సుద్ అలీ హాజరయ్యారు. టౌర్ని ఫైనల్ పోటీ టీం మస్తాన్ జైన్ మరియు జైపాల్ రెడ్డి జట్ల మధ్య జరిగిన పోటీల్లో టీం మస్తాన్ జట్టు విజేత నిలిచింది. టౌర్ని యువజన కాంగ్రెస్ మండల నాయకులు మీర్ జాహిరుద్దీన్ మూర్తుజ, జిషన్ పటేల్ పర్యవేక్షణలో సాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో యువజన కాంగ్రెస్ పటిష్టత కోసం అందరి సమన్వయంతో ముందుకు సాగి ఏకతాటిపై తీసుకొచ్చేందుకు కృషి చెస్తమని అన్నారు. కార్యక్రమంలో మీర్ రియజుద్దీన్, మీర్ సమియుద్దీన్ అలీ, అబ్దుల్ శుకుర్, ఇలియస్ పటేల్, వసంత్ కుమార్, మణిక్ రెడ్డి, స్వామిదస్, గున్ రెడ్డి, సంగారెడ్డి, అబు బక్కర్, రాజు, ఆసీఫ్, నర్సింలు, నజ్జు, రాజు తదితరులు పాల్గొన్నారు.