జనం న్యూస్,నవంబర్ 18,
కంగ్టిసంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్,గ్రామంలో సోమవారం వరకు సనాలు 4287, బ్యాగులు హాజర్ దస్ 558,బ్యాగులు మొత్తం బ్యాగులు 4845, 193,800 కిలోల ధాన్యాన్ని కొనుగోలు నిర్వహించినట్లు సీసీ అనసూయ తెలిపారు. సిసి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలలో మీ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనె విక్రయించాలని రైతులకు సూచించారు. దళారులకు నమ్మి మోసపోవద్దని అన్నారు. గవర్నమెంట్ నిర్ణయించిన మ్యచర్ రాగానే తూకం నిర్వహించడం జరుగుతుందని అన్నారు.సెంటర్కు వచ్చిన క్రమబద్ధీకరణతోనె తూకం నిర్వహించడం జరుగుతుందని అన్నారు.రైతులు తాము పండించిన పంట వరి ధాన్యాన్ని ప్రభుత్వ ఐకెపి కొనుగోలు కేంద్రాలలోనె విక్రయించాలని అన్నారు.ఏ గ్రేడ్ వరి ధాన్యం ₹ 2389,బి గ్రేడ్ వరి ధాన్యం ₹ 2369,సన రకం వరి ధాన్యాన్ని ₹ 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో వివో లీడర్ గంగామణి,బుకి పర్,బానుప్రసాద్ గౌడ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.


