జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
అన్నమయ్య జిల్లానందలూరు లో ఉన్న జ్ఞానదీప్తి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో 9 వ తరగతి చదువుచున్న గుగ్గిళ్ల నాగ స్వాతి అనే విద్యార్థిని షాట్ పుట్ నందు మండల స్థాయి, జిల్లా స్థాయిలలో విజయం సాధించి ఈ రోజు కడపలో క్రీడా ప్రాంగణం నందు రాష్ట్ర స్థాయి పోటీ లో విజయం సాధించిన నాగ స్వాతిని. జ్ఞానదీప్తి పాఠశాల కరెస్పాండంట్ అద్దంకి జానకీనాథ్ విద్యార్థినికి మోమేంటోను బహుకరిచి అభినందనలు తెలిపినారు. జరిగే పోటీలలో విద్యార్థుల ఎంపికకు కృషి చేస్తున్న పాఠశాల హెడ్ మాస్టర్ నిండిగింటి లక్ష్మి ని కొని యాడడం జరిగింది. ఈ కార్యక్రమం లో పాఠశాల అధ్యాపకులు వెంకటరమణ, మీనా, లక్ష్మి మరియు పాఠశాల కోచ్ లు అయిన టువంటి కంప్యూటర్ మాస్టర్ అరుణ్ కుమార్ డేవిడ్ నాగేంద్ర ప్రసాద్ లను స్కూల్ కరెస్పాండంట్ అభినందిచడ మైనది.


