

సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం
జనం న్యూస్ 01 (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురి మెల్ల శంకర్)
కాసాని ఐలయ్య స్ఫూర్తితో భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. స్థానిక మంచికంటి భవన్ లో కాసాని చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించడంలో కాసాని కీలక పాత్ర పోషించారని పార్టీని నిర్మించే క్రమంలో ఎన్నో ఆటంకాలు,శత్రువుల నుండి భౌతిక దాడులు సైతం ఎదుర్కొన్నాడని అన్నారు.తన యావత్ జీవితాన్ని పార్టీకి ప్రజలకి అంకితం చేసిన ధన్యజీవి కాసాని అని కొనియాడారు.ఇళ్ల స్థలాల పోరాట్లో జైలుకు వెళ్లి పేదలకు భూమి పంచేవరకు పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాటాలు చేసి సాధించడాని అన్నారు.ప్రస్తుతం పాలక వర్గాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు నిర్వహించే క్రమంలో కాసాని మరణించడం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని అన్నారు. పేదల పక్షాన పోరాటమే కాసానికి
ఇచ్చే ఘనమైన నివాళి అని అన్నారు.
గ్రామ గ్రామాన కాసాని సంతాప సభలు
సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు
అమరజీవి కామ్రేడ్ కాసాని సంతాప సభలు జిల్లాలో వారం రోజుల పాటు గ్రామ గ్రామాన నిర్వహించాలని పిలుపునిచ్చారు.జిల్లా ఏర్పడ్డాక మొదటి జిల్లా కార్యదర్శిగా జిల్లాలో పార్టీని నడిపించడంలో ప్రజా పోరాటాలు నిర్మించడంలో కాసాని తనదైన ముద్ర వేదారని కొనియాడారు. కాసానిని స్మరిస్తూ సంతాప సభలు నిర్వహిస్తామని తెలిపారు.సంతాప సభను ఏర్పాటు చేస్తున్నట్లు,అఖిల భారత నాయకత్వం హాజరు కానున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పొతినేని సుదర్శన్ రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య ఏజే రమేష్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె బ్రహ్మచారి లీక్కి బాలరాజు అన్నవరపు సత్యనారాయణ జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్ నిమ్మల వెంకన్న నందిపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.