జనం న్యూస్ నవంబర్ 19:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలము :
తాళ్ల రాంపూర్ గ్రామంలోబుదవారం రోజునా ఇందిరమ్మ ఇండ్ల మార్కౌట్ పొందినప్పటికీ ఇంకా నిర్మాణ పనులు ప్రారంభించని లబ్ధిదారుల ఇళ్లను ఎంపీడీవో వెంకటేశ్వర్లు,గ్రామపంచాయితీ సిబ్బంది, నాయకులు సందర్శించారు. లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని సూచిస్తూ అవగాహన కల్పించారు.ఇందిరమ్మ పథకం ద్వారా లభించే ప్రయోజనాలు, ప్రభుత్వం మంజూరు చేసిన సౌకర్యాల వివరాలు ప్రజలకు వివరించారు. ఇళ్ళ నిర్మాణం ఆలస్యం చేస్తే పథకం ప్రయోజనాలు కోల్పోయే అవకాశం ఉందని అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీఅద్యక్షుడు సోమ దేవరెడ్డి, బాల్కొండ బ్లాక్ అద్యక్షుడు అడెం గంగ ప్రసాద్, బెజ్జారం భానుచందర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామపంచాయతీ కార్యదర్శి భోజన్న, సిబ్బంది పాల్గొన్నారు.


