Listen to this article

బిచ్కుంద నవంబర్ 20 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం పత్లాపూర్ గ్రామంలో భక్తి స్పూర్తితో సాగిన ఆఖండ హరినామ సప్త ముగింపు కార్యక్రమంలో జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే పాల్గొన్నారు.హనుమాన్ మందిరం వద్ద ఆంజనేయ స్వామి వారి దర్శనం తీసుకుని, గ్రామస్తులతో కలిసి అఖండ హరినామ సప్త భజన కార్యక్రమంలో పాల్గొన్న హన్మంత్ షిండే భక్తి నినాదాలతో కార్యక్రమాన్ని మరింత భక్తిమయంగా మార్చారు.గ్రామ ప్రజల భక్తి, ప్రత్యేకంగా నిర్వహించిన హరినామ సప్త, పత్లాపూర్ గ్రామ ఆధ్యాత్మిక వైభవాన్ని చాటింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తో పాటు సొసైటీ వైస్ చైర్మన్ యాదవ్ రావు , మాజీ సర్పంచ్ అరుణ్, ఉప సర్పంచ్ శివకాంత్, టిఆర్ఎస్ కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు