జనం న్యూస్: నవంబర్ 20 గురువారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జ్ ;వై. రమేష్;
గ్రంథాలయాలను ఉపయోగించుకుని విజ్ఞానవంతులు కావాలని, చిన్నప్పటినంచే విద్యార్థులు గ్రంథాలు చదవడం అలవరచుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు.
58వ గ్రంథాలయ దినోత్సవ వారోత్సవ ముగింపు సమావేశాలు సిద్దిపేట జిల్లా కేంద్ర గ్రంధాలయంలో జరిగాయి. గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి మాట్లాడుతూ అత్యాధునికంగా గ్రంథాలయంను అందుబాటులో తెస్తామన్నారు. విద్యార్థులు అన్ని రంగాలలో రాణించాలని, ఇష్టంగా చదువుతూ ముందుకు సాగాలన్నారు. వినూత్న ఆలోచనలతో నూతన ఒరవడి సృష్టించాలన్నారు. కవి చొప్పదండి సుధాకర్ మాట్లాడుతూ సంస్కారవంతమైన జీవితానికి గ్రంథాలయాలు దోహదం చేస్తాయన్నారు. విద్యార్థుల ప్రతిభ దాగదన్నారు. చిత్రలేఖనం, వ్యాసరచన, సుడోకో, జీకే, ముగ్గుల పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులతో పాటు ప్రశంస పత్రాలు అందజేశారు. విద్యాశాఖ సూపరెండెంట్ రాజేశ్వరి, బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశం, న్యాయవాది మనోహర్, మామిడాల స్రవంతి, గ్రంథపాలకులు కె.రాజు, దాసరి రాజు, శ్రీనివాస్, ముజఫర్, మల్లయ్య, సాయి, హరి, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠకులు తదితరులు పాల్గొన్నారు.


