Listen to this article

శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఆకాశ దీపో త్సవంలో సిరమ్మ

జనం న్యూస్‌ 21 నవంబర్‌, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

ఈ రోజు నెల్లిమర్ల నియోజకవర్గం నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామంలో కొలువైన శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో ఆకాశ దీపోత్సవ మహోత్సవం కార్య కార్యక్రమానికి కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వైయస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయ కర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ కార్తీక మాసం సందర్భంగా జరిగిన ఆకాశ దీపోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా గురువారం పాల్గొన్నారు తదనంతరం శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు ముందుగా ఆలయ కమిటీ సభ్యులు వేద పండితులు పూర్ణకుంభంతో సిరమ్మకు ఘనంగా స్వాగతం పలికారు తరువాత కమిటీ సభ్యులు సిరమ్మను శాలువతో సత్కరించి పుష్పగుచ్చం అందించారు అనంతరం వేద పండితులు ఆశీర్వాదం పొందారు తమ గ్రామానికి మొదటి సారిగా విచ్చేసిన మన సిరమ్మను చూసేందుకు సారిపల్లి ప్రజలు ఉత్సాహం చూపారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సారిపల్లి వైస్ సర్పంచ్ లక్ష్మణరావు ప్రజాప్రతినిధులు స్థానిక ముఖ్య నాయకులు చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు