నిర్వహించిన పటాన్చెరు జర్నలిస్టులు
జనం న్యూస్ నవంబర్ 21 సంగారెడ్డి జిల్లా, రామచంద్రాపురం:
రామచంద్రాపురంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో సీనియర్ జర్నలిస్టు గిరి ప్రసాద్ యాదిలో నిర్వహించిన సంస్మరణ సభ గురువారం ఘనంగా నిర్వహించారు. మీడియా రంగంలో రెండు దశాబ్దాలకు పైగా సేవలందించిన గిరి ప్రసాద్‌ను వివిధ రాజకీయ పార్టీ నాయకులు, అధికారులు, జర్నలిస్టులు స్మరించుకున్నారు.సుమారు 20 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన గిరి ప్రసాద్, పచ్చి సమాచారాన్ని ప్రజల ముందుకు తీసుకురావడంలో శ్రమించిన, నిజాయితీ గల పాత్రికేయుడిగా పేరుపొందారు. పటాన్చెరు నియోజకవర్గంలో జర్నలిస్టుల మధ్య ఐక్యత, వృత్తిపట్ల నిబద్ధత పెంపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించినట్టు సహచర జర్నలిస్టులు గుర్తుచేసుకున్నారు.సంస్మరణ సభకు పటాన్చెరు నియోజకవర్గం నలుమూలల నుంచి భారీ ఎత్తున మీడియా ప్రతినిధులు తరలివచ్చారు. గిరి ప్రసాద్ ఫోటోకు పుష్పాంజలి ఘటిస్తూ ఆయన సేవలను నెమరువేసుకున్నారు.ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, అధికారులు మాట్లాడుతూ
“గిరి ప్రసాద్ మరణం మీడియా వర్గాలకు పెద్ద లోటు. ప్రజా సమస్యలపై ఆయనకు ఉన్న అవగాహన, వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లే విధానం అరుదైనది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి” అని పేర్కొన్నారు.అలాగే గిరి ప్రసాద్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.సంస్మరణ సభ నిర్వహణలో పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


