జనం న్యూస్ నవంబర్ 21 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ప్రభుత్వ విప్ & ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు
కాట్రేనికోన మండల హెడ్‌క్వార్టర్స్‌లో నిర్మాణం జరుగుతున్న అన్నా క్యాంటీన్ పనులను ఈ రోజు ప్రత్యక్షంగా పరిశీలించిన దాట్ల సుబ్బరాజు , పనుల పురోగతి గురించి అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ:ప్రజలకు తక్కువ ధరకే పరిశుభ్రమైన, పోషకాహారం అందించే అన్నా క్యాంటీన్‌ను త్వరితగతిన పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి. ఇది మండల ప్రజలకు ఎంతో ఉపయోగపడే ప్రజాహిత ప్రాజెక్ట్. పనుల నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండకూడదు” అని అధికారులు ఆదేశించారు.అన్నదాతలూ, కార్మికులూ, సాధారణ ప్రజలూ లబ్ధి పొందేలా ఈ సదుపాయాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు వేగవంతం చేసినట్టు తెలిపారు.ఈ కార్యక్రమం లో సీనియర్ నాయకులు గుత్తులు సాయి నడింపల్లి సుబ్బరాజు, పిఎస్ఎన్ రాజు, వి రఘువర్మ, వంగా దుర్గ బాబు, సుంకర శ్రీను కూటమి సీనియర్ నాయకులు అభిమానులు అధికారులు మీడియా మిత్రులు పాల్గొన్నారు.



