Listen to this article

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 22

పి. రాములు నేత జాగో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు

దేశంలో రోజు ఎక్కడో ఒక దగ్గర బస్సులు ప్రమాదాన్నికి గురై అగ్నికి ఆహుతి అవుతున్నాయి అనేక ప్రమాదాలలో జనాలు విపరీతంగా గాయపడుతున్నారు అయినప్పటికీని జహీరాబాద్ ప్రైవేట్ పాఠశాల బస్సులలో చిన్నచిన్న పిల్లలు పాఠశాలకు వస్తూ ఉంటారు ఈ బస్సులు ప్రమాదానికి గురైతే ప్రమాదం నుండి బయటపడడానికి ప్రమాదాన్ని నివారించడానికి ఎలాంటి వస్తువులు లేకుండానే బస్సులు నడుపుతున్నారు కనీసం గాయపడ్డ వారికి ఏవైనా మెడిసిన్లు పెట్టాలన్న కనీస మెడికల్ కిట్టు లేకుండా బస్సులు నడుపుతున్నారు ఇదంతా చూస్తున్న జహీరాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మరియు అగ్నిమాపక శాఖ అధికారులు తమకేమీ పట్టదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు వాస్తవానికి భవిష్యత్ తరాలు చిన్న పిల్లలు ఈ స్కూల్ బస్సులలో ప్రయాణిస్తున్నప్పుడు ఏవైనా ప్రమాదాలు జరిగి ప్రాణాలు ఆరోగ్యం కోల్పోతే ఏ అధికారి ఏ నాయకుడు కూడా వారి ప్రాణాలను ఆరోగ్యాలను తెచ్చి ఇవ్వలేరు కాబట్టి నిబంధనల ప్రకారం స్కూల్ బస్సులు నడుస్తున్నాయో లేదో ఇకనైనా స్కూల్ బస్సులను పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ఉంటే అలాంటి బస్సులను సీజ్ చేయండి చాలా మటుకు బస్సులు నడిపే డ్రైవర్లు కనీస ఆయురారోగ్యంగా కనీస ఆయురారోగ్యంగా లేకుండా ఉంటున్నారు అదేవిధంగా పాన్ పరాగ్ లాంటి వి నములుతూ మత్తులో బస్సులు తోలుతున్నారు డ్రైవర్ల పరిస్థితులను కూడా గమనించాలి బస్సులలో కనీసం మెడికల్ కిట్ బాక్సులు ఒకటి ఏర్పాటు చేయించాలి బస్సుల ఫిట్నెస్ కూడా పూర్తిగా పరిశీలించాలి కొన్ని బస్సులకు ఎలాంటి ఇన్సూరెన్స్ కూడా లేకుండా తోలుతూ ఉన్నారు కనీసం ఏదైనా మంటలు ఏర్పడితే మంటలు ఆర్పడానికి ఉపయోగపడే వస్తువులు కూడా వీటన్నిటిని ఇకనైనా జహీరాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మరియు అగ్నిమాపక అధికారులు పరిశీలించి ప్రైవేట్ స్కూల్ బస్సులలో పరిస్థితులు చక్కబెట్టి భవిష్యత్తులో ఏమైనా ప్రమాదాలు జరిగితే స్కూల్ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జహీరాబాద్ పట్టణ ప్రజల పక్షాన జాగో తెలంగాణ కోరుచున్నది కార్యక్రమంలో ,,జాగో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యులు మోహమ్మద్ ఇమ్రాన్,,, ,బిజ్జా భాస్కర్ శాంత్ కుమార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాదినం శివప్రసాద్ ప్యార్ల దశరథ్ బి.బాలు మొదలగు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు