జనం న్యూస్ 23 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
చెల్లూరి.జోగయ్య గారి భౌతికాయాన్ని సందర్శించి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారు.* ఆదివాసీ హక్కుల కోసం ఎన్నో న్యాయ పోరాటాలు చేసిన గిరిజన నాయకుడు చెల్లూరి జోగయ్య (47సం.లు) గారు గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో భాధపడుతూ ఈరోజు మధ్యాహ్నం పాచిపెంట మండలం,పనుకు వలస వారి స్వగ్రామంలో ఇంటి వద్దనే తుదిశ్వాస విడిచారు.ఈ తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి వర్యులు,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు& రాష్ట్ర వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు శ్రీ పీడిక.రాజన్నదొర గారు వెంటనే పనుకువలస గ్రామం వెళ్లి చెల్లూరి.జోగయ్య గారి పార్థివదేహాన్ని సందర్శించి పూలమాల వేసి దిగ్ర్భాంతి వ్యక్తం చేయడంతో పాటు గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు చెల్లూరు.సీతారాం గారు,చింతా.సీతయ్య గారు, గిరిజన నాయకులు,స్నేహితులు, బంధువులు గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.


