

జనం న్యూస్ జనవరి 10 (నిర్మల్ జిల్లా స్టాపర్ ద్యావతిగంగాధర్) నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ బిజెపి అధ్యక్షునిగా కీర్తి మనోజ్ కుమార్ నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా నియమకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. నాపై నమ్మకంతో నాకు ఖానాపూర్ పట్టణ పదవి ఇచ్చినందుకు బిజెపి పార్టీని బలోపేతం చేయడానికి శాయశక్తులు కృషి చేస్తానని తెలిపారు.