ఇందిరా మహిళా శక్తి, చీరల పంపిణీ.
జనం న్యూస్, 24 నవంబర్, కొల్లూరు గ్రామం, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతల గట్టు నర్సిములు )
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగం మండల పరిధిలోని, కొల్లూరు గ్రామంలో, మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి, ఇందిరా మహిళా శక్తి, చీరల పంపిణీ కార్యక్రమాన్ని, గ్రామపంచాయతీ కార్యాలయంలో, నిర్వహించగా, ఈ కార్యక్రమానికి, ప్రత్యేక అతిథిగా న్యాయవాది నందు పాటిల్, ముఖ్య అతిథులుగా, డప్పురి సంగమేశ్, మరియు చింతల గట్టు శివరాజ్ లుపాల్గొని, గ్రామములోని స్వయం సహాయక సంఘాల సభ్యురాళ్లకు, ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కోటి మంది మహిళలను, కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని, ప్రజా ప్రభుత్వం, మహిళల కు అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుందని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు స్వయం సహాయక సంఘాల ద్వారా, రుణాలు మంజూరు చేస్తుందని, మహిళల ఆర్థిక ప్రగతికి, కోట్లాది రూపాయల లోన్లు, అందిస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, వివో ఏ, చింతల గట్టు మరియమ్మ, వివో వో బి లు, మొగుడంపల్లి శివ నంద, బుజ్జమ్మ, కొల్లూరు గ్రామంలోని, స్వయం సహాయక సంఘాల సభ్యురాళ్లు, మహాత్మా గాంధీ ఉపాధి హామీ, క్షేత్రస్థాయి సహాయకుడు,( ఫీల్డ్ అసిస్టెంట్ ) చింతల గట్టు సుధాకర్, మరియు గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.


