Listen to this article

గుడిపల్లి, నవంబర్ 24:

నల్గొండ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ గారి సమక్షంలో, గుడిపల్లి మండల పార్టీ అధ్యక్షులు ఎలుగూరి వల్లపు రెడ్డి గారి ఆధ్వర్యంలో భీమనపల్లి గ్రామానికి చెందిన పలువురు యువకులు, పెద్దలు దాదాపు 10 కుటుంబాలు ఈరోజు గులాబీ కండువా కప్పుకుని BRS పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.ఈ సందర్భంగా పార్టీలో చేరిన యువకుల, మరియు పెద్దల వివరాలు:కంభంపాటి శ్రీనయ్య, బెళ్లి కోటేష్, సింగం వెంకటయ్య, బెల్లి అంజి, బోగాది సైదిరెడ్డి, సంకబుడ్డి కోటేష్, గుండెబోయిన శివ, జిల్లాబోయిన వెంకటేష్, వెంపల్ల లింగయ్య, సుధనబోయిన అంజి, బెల్లి లింగస్వామి.గ్రామాభివృద్ధి, యువతకు అవకాశాలు, రైతుల సమస్యలు – ఇవన్నీ పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ గత రెండు సంవత్సరాల కాలంలో పూర్తిగా విఫలమైందని యువత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలో అభివృద్ధి పనులు నిలిచిపోవడం, పేదల పట్ల నిర్లక్ష్యం, ప్రజా సమస్యలు పట్టించుకోకపోవడం వంటివి కారణంగా కాంగ్రెస్‌ను వదిలివస్తున్నట్టు తెలిపారు.ప్రజలతో నిత్యం ఉండే నాయకత్వం, అభివృద్ధి పథకాల అమలు, యువతకు అవకాశాలు కల్పించే ధృడ సంకల్పం—ఇవన్నీ తమను BRS పార్టీలో చేరడానికి ప్రేరేపించాయని యువకులు తెలిపారు.ఈ సందర్భంగా రమావత్ రవీంద్ర కుమార్ గారు నూతన సభ్యులకు గులాబీ కండువాలు కప్పి, పార్టీలోకి స్వాగతం పలికారు. గుడిపల్లి మండల అధ్యక్షులు వల్లపు రెడ్డి గారు భీమనపల్లి గ్రామం నుండి పెద్ద సంఖ్యలో యువత BRS వైపు రావడం పార్టీ బలోపేతానికి పెద్ద శక్తినిచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అర్వపల్లి నరసింహ ఎర్ర యాదగిరి తోటకూరి పరమేష్ యాదవ్,కోన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి మారుపాక జగన్ తదితరులు పాల్గొన్నారు.