Listen to this article

జనం న్యూస్ 25 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

జోగులాంబ గద్వాల్ జిల్లా కేటి దొడ్డి మండలం నందిన్నె గ్రామం మాజీ సర్పంచ్ మృతి పై కేసులో వీడుతున్న చిక్కుముడి వారే హత్య చేశారంటూ కుటుంబ సభ్యులు, బందువుల ఆరోణలు మూడు నెలల ముందే సుఫారీ గ్యాంగ్ తో ఒప్పందం?రాజకీయం, వ్యాపారం, భూతగాదాలే హత్యకు దారితీసిందా?పోలీసుల అదుపులో నిందితులు?పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లువడనున్నాయి.గద్వాల: ధరూర్‌ మండలం జాంపల్లి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కేటిదొడ్డి మండలం నందిన్నె మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడు హత్య కేసులో నిందితుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. జిల్లాలో‌ సంచలనం సృష్టించిన మాజీ సర్పంచ్ హత్య కేసు చిక్కుముడి వీడుతున్నట్లేనని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో సూత్రధారులు, పాత్రధారులెవరన్న విషయమై ఇప్పటికే ఓ స్పష్టతకు వచ్చారు. ఈ కేసులో సంబంధమున్న కీలక నిందితులు ఇంకా పరారీ ఉన్నారు. వారు దొరికితే మొత్తం చిక్కుముడి వీడిపోనుంది. మరోవైపు ఘటన జరిగి ఆయిదు రోజులవుతోంది. జిల్లా వ్యాప్తంగా సంచలనం కావడంతో పోలీసు యంత్రాంగం దృష్టంతా దీనిపైనే కేంద్రీకృతమై ఉంది.*పరారీలోనే సూత్రధారి, పాత్రధారి…:* ఈ కేసులో రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి ప్రధాన పాత్రధారిగా గుర్తించారు. బైక్ పై వెళ్తున్న నందిన్నె గ్రామ మాజీ సర్పంచ్ చిన్నభీమరాయుడును బొలేరో వాహనంతో గుద్ది హత్య జరిగిన రోజు రాత్రే ప్రధాన సూత్రదారి అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఈ కేసులో… నిందితులకు షెల్టర్ సమకూర్చిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు సూత్రదారులను పోలీసులు అదుపులోకి తీసుకుని‌ విచారిస్తున్నారు. ప్రధాన పాత్రధారి మాత్రం పరారిలో ఉన్నట్లు, ప్రధానవ్యక్తి పట్టుబడితే అన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.అంతా తెలిసిన వారే…!: కీలక సూత్రధారులుసూత్రదారులు,‌పాత్రధారులు అంతా చిన్న భీమరాయుడుకు తెలిసిన వ్యక్తులే. ఆయనతో భూవివాదాలు, రాజకీయం, వ్యాపారానికి అడ్డుస్తున్నవారేనని పోలీసులు అనుమానించి, అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎవరి పాత్ర ఎంత అన్న అంశంపై వివరాలు సేకరిస్తున్నారు.