జనం న్యూస్ 26నవంబర్ పెగడపల్లి
జగిత్యాల జిల్లాపెగడపల్లి మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి పాల్గొన్నారు. ధర్మపురినియోజకవర్గంలోని ఆరు మండలాలకు మొత్తం ₹2 కోట్లు 78 లక్షల విలువైన రుణాలు మంజూరు అయ్యాయి అని మంత్రి వెల్లడించారు.ఈ సందర్భంగా పలువురులబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు, అలాగే కొందరికి కళ్యాణలక్ష్మి చెక్కులును మంత్రి అందజేశారు. కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై బీసీ సంఘాలు చేస్తున్న ఆందోళనల విషయంలో స్పందించారుబీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. బీసీసంఘంనాయకుడుఆర్.కృష్ణయ్యకు గౌరవం ఉన్నప్పటికీ, రిజర్వేషన్ల కోసం రాష్ట్రంలో కాకుండా దేశ రాజధాని ఢిల్లీలో పోరాటం చేస్తే కేంద్రంపై ఒత్తిడి సృష్టించగలమని, ఆ దిశగా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ఢిల్లీలో జరిగే ఉద్యమాలకు ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేయాలని కృష్ణయ్యకు మంత్రి పిలుపునిచ్చారు. అలాగే రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు బీసీ సంఘాలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్, ప్రజాప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.


