మద్నూర్ నవంబర్ 25 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని మెనూర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం మహిళల సంక్షేమార్థం అందిస్తున్న నాణ్యమైన చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం గ్రామంలో ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాల మహిళలకు ప్రయోజనం చేకూరే విధంగా చీరలను నాణ్యతతో అందించడం పట్ల గ్రామస్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ—మహిళల కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టి, వారిని అన్ని విధాలుగా ఆదుకుంటున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు గ్రామాల వరకూ చేరుతున్నాయనడం అభినందనీయమని అన్నారు.కార్యక్రమంలో మద్నూర్ మండల కాంగ్రెస్ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు దరాస్ సాయిలు, ఆలయ ఛైర్మన్ రామ్ పటేల్, మాజీ సర్పంచ్ విట్టల్ గూరిజి, హన్మాండ్లు స్వామి, సురేష్ జుబ్రే, గంగారాం, మహిళ సంఘాల నాయకురాళ్లు, సెక్రటరీలు, మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.



