జనం న్యూస్ నవంబర్ 25:నిజామాబాద్ జిల్లా
ఏర్గట్ల మండలకేంద్రంలో మంగళవారం రోజునా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ఆర్థిక అక్షరాస్యత ఎంతో ముఖ్యమని ఏర్గట్ల ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ షేక్ కరీముల్లా ఉద్ఘాటించారు. పీఎం శ్రీ ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సులో ఆయన పాల్గొని కీలక సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకింగ్ వ్యవస్థ తీరుతెన్నులను వివరించారు. ఆర్థిక లావాదేవీల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇన్సూరెన్స్ ప్రాధాన్యతపై శ్రీరామ్ ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన డిప్యూటీ జనరల్ మేనేజర్ సురేష్ సైతం పాల్గొన్నారు. భవిష్యత్తుపై భరోసా కోసం ప్రతి ఒక్కరూ బీమా చేయించుకోవాలని ఆయన సూచించారు. బ్యాంకింగ్ వ్యవస్థ, లోన్ యాప్ ల వాడకం, ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో ఎదురవుతున్న సైబర్ సమస్యలపై అవగాహన సదస్సులో వక్తలు ప్రసంగించారు. పెట్రోల్ బంకులో 500 రూపాయల జీతానికి పనిచేసిన ధీరుభాయ్ అంబానీ ఆర్థిక క్రమశిక్షణతో కుబేరుడుగా ఎదిగిన విషయాన్ని నొక్కి చెప్పారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణ చారి మాట్లాడుతూ
డబ్బు విలువ తెలుసుకుంటే విద్యార్థులు భవిష్యత్తులో ఆ స్థాయికి ఎదిగొచ్చని ఆయన స్ఫూర్తినింపారు. ఆన్లైన్ గేమ్స్ పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, తల్లిదండ్రులు సంపాదించుకున్న డబ్బులు ఫైబర్ మోసానికి గురవకొండ జాగ్రత్త పడాలని హెచ్ఎం హెచ్చరించారు. ఒకరోజు పాటు ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు చక్కని సందేశాత్మకమైన నాటికలు ప్రదర్శించారు. లోన్ యాప్స్ లో తలెత్తే సమస్యలు, ఆర్థిక క్రమశిక్షణ తప్పితే వచ్చే అనర్ధాలు వంటి అంశాలపై నాటిక రూపంలో విలువైన సందేశం ఇచ్చారు. ఆర్థిక అక్షరాస్యతపై చక్కని పాటతో సందేశాన్ని ఇచ్చారు విద్యార్థులు. ఇదే కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు గీసిన చార్ట్ ల ప్రదర్శన ఆకట్టుకుంది. విద్యార్థులు ఎంతో శ్రమతో గీసిన ఈ చార్ట్ లను కార్యక్రమానికి విచ్చేసిన అతిధులు చూసి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్బిఐ ఎరుగట్ల శాఖ మేనేజర్ షేక్ కరీముల్లా, శ్రీరామ్ ఎల్ఐసి డీజీఎం సురేష్ గారికి, ప్రధానోపాధ్యాయులు గారికి పాఠశాల బృందం సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా గత వారం నుంచి నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమములో మునిరోద్దీన్, ప్రసాద్, రాజశేఖర్, సమిత, శ్రీనివాస్, విజయకుమార్ రాజ నర్సయ్య ,గంగాధర్ ,జ్యోతి ట్రింకిల్ కుమార్, గంగమోహన్ కోమలి ,కృష్ణవేణి, రిషిక మొదలగు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



