జుక్కల్ నవంబర్ 25 జనం న్యూస్
లండన్ పర్యటన అనంతరం ఈరోజు హైదరాబాద్ చేరుకున్న జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకి ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే శిష్యుడు, తాజాగా కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షుడిగా ఎంపికైన ఏలే మల్లికార్జున్ స్వయంగా వెళ్లి గురువుకి ఆత్మీయ స్వాగతం పలికారు. తమ రాజకీయ ప్రయాణానికి పునాది వేసిన గురువుకు కృతజ్ఞతగా శాలువాతో సత్కారం చేశారు.ఎమ్మెల్యే కూడా నూతన డిసిసి అధ్యక్షుడిని అభినందించి, జిల్లాలో కాంగ్రెస్ బలోపేతానికి కలిసి పనిచేయాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.




