Listen to this article

జనం న్యూస్ నవంబర్ 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి

శాయంపేట మండలంలోని కొత్త గట్టు సింగారం క్రాస్ రోడ్డు వద్ద ఇటీవల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా పరకాల ఏ సీ పి సతీష్ బాబు రోడ్డు ప్రమాదాల నివారణకు రాత్రి వేళ వాహనదారులకు కనిపించేలా త్రీడీ రేడియం స్టిక్కర్లు బోర్డింగు కటౌట్స్ ఏర్పాటు చేశారు ఈ లైట్లు డ్రైవర్లను నెమ్మదిగా వెళ్ళమని హెచ్చరిస్తాయని తద్వారా రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుతుందని ఏ సీ పీ సతీష్ బాబు అన్నారు ఈ కార్యక్రమంలో శాయంపేట సీ ఐ పి రంజిత్ రావు ఎస్సై జక్కుల పరమేశ్వర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు…